roja ramani: ఏనుగులు పరిగెత్తుకు వచ్చినా .. పాముల్ని మెడలో వేసినా భయపడలేదు: రోజారమణి

షార్ట్స్‌లో చూడండి
తాజాగా తెలుగు పాప్యులర్ టీవీతో రోజా రమణి మాట్లాడుతూ .. 'భక్త ప్రహ్లాద' షూటింగ్ నాటి ముచ్చట్లను పంచుకున్నారు. "ఈ సినిమాలో అరడజను ఏనుగులు నా వైపుకు పరిగెత్తుకు వస్తాయి. ఒక ఏనుగు నన్ను తొక్కేయడానికి కాలు ఎత్తుతుంది. శిక్షణ పొందినవే అయినా ఆ ఏనుగులు కంట్రోల్ అవుతాయో లేదో తెలియదు .. అందువలన ఏనుగులతో అలవాటు వున్న కుర్రాడితో ఆ సీన్ చేయాలని చూశారు"

"కానీ నేనే చేస్తాను అంటూ నేను మారాం చేయడంతో నాతోనే చేశారు. అప్పుడు కూడా నేను భయపడింది లేదు. అదంతా నిజంగా ఆ నారాయణుడి కటాక్షమే. ఆ తరువాత చుట్టూ పది పాములు .. మెడలో నిజమైన పాములు వేసుకుని నిలబడాలి. మెడలో వేయగానే ఆ పాములు జారిపోతూ ఉండేవి. గట్టిగా పట్టుకోమని పాములతను చెబితే అలాగే పట్టుకున్నాను. అప్పుడు కూడా నేను భయపడింది లేదు" అంటూ చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
roja ramani

More Telugu News