నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో.. ధ‌ర్నాకు దిగిన సినీన‌టుడు విశాల్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో.. ధ‌ర్నాకు దిగిన సినీన‌టుడు విశాల్‌!

  • ఉప ఎన్నిక‌కు విశాల్ వేసిన నామినేషన్ తిర‌స్క‌ర‌ణ‌
  • అభ్యంత‌రం తెలుపుతోన్న సినీన‌టుడు
  • ఉద్దేశ‌పూర్వ‌కంగానే నామినేష‌న్‌ను తిర‌స్క‌రించారు
  • దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న విశాల్ 
త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేయ‌డానికి సినీన‌టుడు విశాల్ స్వ‌తంత్ర‌ అభ్యర్థిగా నామినేష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. అయితే, నామినేష‌న్‌లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ అధికారి దాన్ని తిర‌స్క‌రించడంతో విశాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

ఈ క్రమంలో ఆర్కేన‌గ‌ర్ రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యం ఎదుట ధ‌ర్నాకు దిగాడు. త‌న నామినేష‌న్‌ను తిరస్క‌రించ‌డం ప‌ట్ల అభ్యంత‌రం తెలుపుతున్నాడు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న నామినేష‌న్‌ను తిర‌స్క‌రించార‌ని, దీని వెనుక పెద్ద కుట్ర ఉంద‌ని ఆరోపించాడు.
vishal
strike
rk nagar

More Telugu News