హిట్ ఇచ్చిన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన సూర్య!
- 'గ్యాంగ్' తో వస్తోన్న సూర్య
- రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- 'నగరం' దర్శకుడికి అవకాశం
ఈయన సందీప్ కిషన్ తో తమిళంలో 'నగరం' అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. రీసెంట్ గా ఆయన ఒక కథ చెప్పగా సూర్యకు బాగా నచ్చేసిందట. దాంతో ఆయన ఈ ప్రాజెక్టును వెంటనే మొదలుపెట్టేద్దాం అని చెప్పారట. ప్రస్తుతం 'గ్యాంగ్' సినిమా పనుల్లో వున్న సూర్య .. ఆ పనులు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. మొత్తానికి లోకేష్ కనగరాజ్ మంచి ఛాన్సే కొట్టేశాడని చెప్పుకుంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.