పరువు నష్టం దావా వేస్తా... గాలి ముద్దుకృష్ణమనాయుడుపై మండిప‌డ్డ ఎమ్మెల్యే రోజా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరువు నష్టం దావా వేస్తా... గాలి ముద్దుకృష్ణమనాయుడుపై మండిప‌డ్డ ఎమ్మెల్యే రోజా!

  • క‌లెక్ట‌ర్‌తో క‌లిసి హంద్రీనీవా ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌ మార్చానని ఆరోపించారు
  • ఆధారాలు చూప‌క‌పోతే ప‌రువున‌ష్టం దావా వేస్తా
  • ముద్దుకృష్ణమనాయుడు తిరుమల దర్శనం టికెట్లు కూడా అమ్ముకుంటారు
టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుపై పరువునష్టం దావా వేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా హెచ్చ‌రించారు. ఆయ‌న త‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశార‌ని మండిప‌డ్డారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ... మాజీ కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌తో కలిసి తాను హంద్రీనీవా ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌ మార్చానని ముద్దు కృష్ణ‌మ‌నాయుడు ఆరోపణలు చేశార‌ని, ఇందుకు సంబంధించిన‌ ఆధారాలను ఆయ‌న‌ బహిర్గతం చేయాల‌ని డిమాండ్ చేశారు.

తాను సినిమాల్లో హీరోయిన్‌గా దాదాపు 150 సినిమాల్లో నటించాన‌ని, నిజాయతీగా డబ్బు సంపాదించానని రోజా ఉద్ఘాటించారు. అంతేకానీ, సూట్‌ కేసు చేతిలో పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించలేద‌ని అన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు తిరుమల దర్శనం టికెట్లు కూడా అమ్ముకుంటార‌ని రోజా ఆరోపించారు. ఆయ‌న అనుచ‌రులు పలుసార్లు దోపిడీకి పాల్ప‌డ్డార‌ని అన్నారు.    
muddu krishnama naidu
mla roja
YSRCP

More Telugu News