డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ హాస్యనటుడు నవీన్... నలుగురు యువతులు కూడా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ హాస్యనటుడు నవీన్... నలుగురు యువతులు కూడా!

  • గత రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో తనిఖీలు
  • అడ్డంగా దొరికిపోయిన పలువురు యువతీ యువకులు
  • 20 కార్లు, 14 టూ వీలర్లూ సీజ్
మందు కొట్టి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంతగా ప్రచారం సాగిస్తున్నా, వారాంతాల్లో ఎన్ని కేసులు బుక్ చేస్తున్నా మందు బాబులు ఎంతమాత్రమూ మారడం లేదు. గత రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, పలువురు పూటుగా మందు కొట్టి వాహనం నడుపుతూ అడ్డంగా దొరికిపోయారు. వారిలో సినీ హాస్య నటుడు నవీన్ కూడా ఉన్నాడు.

మొత్తం 34 మంది దొరికిపోయారని, వారిలో నలుగురు యువతులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. 20 కార్లు, 14 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని, పట్టుబడిన వారికి సోమవారం నాడు కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టు ముందు హాజరు పరుస్తామని తెలిపారు. పలువురు మందుబాబులు పోలీసులకు దొరకకుండా పారిపోయేందుకు ప్రయత్నించగా, వారిని వెంబడించి మరీ పట్టుకుని డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
Drunken drive
Comedian Naveen
Hyderabad

More Telugu News