'కాలా' సినిమా విడుదలకి ముహూర్తం ఖరారు
- రజనీ .. రంజిత్ కాంబినేషన్లో 'కాలా'
- పవర్ఫుల్ డాన్ గా రజనీకాంత్
- ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు
పవర్ ఫుల్ డాన్ గా రజనీకాంత్ కనిపించనున్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారనేది తాజా సమాచారం. రజనీ - శంకర్ కాంబినేషన్లో రూపొందిన '2.0' జనవరి 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వేసవికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 'కాలా' ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.