samanta: నాగ్ సపోర్ట్ తో 'యూటర్న్' నిర్మాతగా సమంత!

షార్ట్స్‌లో చూడండి
కన్నడలో మిస్టరీ నేపథ్యంలో వచ్చిన చిత్రాల జాబితాలో 'యూటర్న్' ముందువరుసలో కనిపిస్తుంది. గత ఏడాది కన్నడలో హిట్ కొట్టిన చిత్రాలలో ఇది ఒకటి. శ్రద్ధా శ్రీనాథ్ .. రోగర్ నారాయణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అక్కడ మంచి ఆదరణ లభించింది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లోకి రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో సమంత వుంది.

నాగ్ సపోర్ట్ చేయడంతో రంగంలోకి దిగిన సమంత, ఇటీవలే చైతూతో కలిసి బెంగళూర్ వెళ్లి .. ఈ సినిమా రీమేక్ విషయమై దర్శకుడు పవన్ కుమార్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లోను ఆయనే దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.    
Go Back to Shorts
samanta
nag

More Telugu News