rashi khanna: రాశీఖ‌న్నా పుట్టిన‌రోజు వేడుక‌లో రవితేజ, రానా, రకుల్‌ప్రీత్‌, చైతూ, సాయిధరమ్ తేజ్‌ల‌ సంద‌డి!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్‌లో మంచి విజ‌యాలు సొంతం చేసుకున్న సినీ న‌టి రాశీఖన్నా ఈ రోజు పుట్టినరోజు వేడుక‌ను జరుపుకుంటోంది. ఆమెకు సినీన‌టులు రవితేజ, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సాయిధరమ్‌ తేజ్‌, నాగచైతన్య వంటి స్టార్‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాశీఖ‌న్నా ఇచ్చిన పార్టీకి వెళ్లిన వీరు అక్క‌డ సంద‌డిగా గ‌డిపారు. ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ విష‌యాన్ని రాశీఖ‌న్నా సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది.

గోపీచంద్ హీరోగా వ‌చ్చిన ‘ఆక్సిజన్‌’ సినిమా నిన్న విడుద‌లైన విష‌యం తెలిసిందే. అందులో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఆమె న‌టించిన ‘ఊహ‌లు గుసగుసలాడే’, ‘జైలవ కుశ’ సినిమాలు మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే.  

     
Go Back to Shorts
rashi khanna
raviteja
birthday

More Telugu News