వెరైటీగా నిఖిల్ సినిమా ప్రీ లుక్ .. రేపు సాయంత్రం ఫస్టులుక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెరైటీగా నిఖిల్ సినిమా ప్రీ లుక్ .. రేపు సాయంత్రం ఫస్టులుక్

  • కిరిక్ పార్టీ' రీమేక్ లో నిఖిల్
  • దర్శకుడిగా శరణ్ 
  • కథానాయికలుగా సంయుక్తా హెగ్డే .. సిమ్రాన్ పరీన్జా 
తెలుగు తెరపై దూకుడు చూపిస్తూ .. వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటూ వెళుతోన్న కథానాయకులలో నిఖిల్ కూడా కనిపిస్తాడు. వైవిధ్యభరితమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ'కి రీమేక్ లో చేస్తున్నాడు. శరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ ప్రీ లుక్ ను వదిలారు.

ఓట్ ఫర్ కృష్ణ .. రివొల్యూషన్ .. బీ ఏ రెబల్ .. అంటూ గోడపై రాతలతో పాటు, విప్లవకారుడు చేగువేరా స్కెచ్ కూడా కనిపిస్తుంది. ఇదే పోస్టర్లో ఓ వైపున క్రికెట్ బ్యాట్ కూడా కన్పిస్తోంది. క్రికెట్ అంటే ఇష్టపడే విప్లవ భావాలు కలిగిన ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఈ సినిమాలో నిఖిల్ కనిపించనున్నాడనే విషయం ఈ ప్రీ లుక్ ద్వారా తెలుస్తోంది. రేపు సాయంత్రం 5 గంటలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టుగా ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన కథానాయికలుగా సంయుక్తా హెగ్డే .. సిమ్రాన్ పరీన్జా కనిపించనున్నారు.      
nikhil
samyukta hegde

More Telugu News