ఆరుగురు పోలీసులు అప్పట్లో నన్ను ఎలా చితక్కొట్టారో ఈ వీడియో చూడండి!: ఎంపీ బాల్క సుమన్
- నవంబరు 29, 2009లో తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష ప్రారంభం
- తార్నాకలో భగ్గుమన్న విద్యార్థులు
- లాఠీలతో బాల్క సుమన్‌పై విరుచుకుపడ్డ ఆరుగురు పోలీసులు
- ఆ వీడియో పోస్ట్ చేసిన సదరు ఎంపీ
కేసీఆర్‌కి మద్దతుగా ఓయూలో ర్యాలీ చేపట్టారు. అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు ర్యాలీని అణచివేశారు. ఈ సందర్భంగానే అప్పటి విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌ను ఆరుగురు పోలీసులు దాదాపు 30 లాఠీ దెబ్బలు కొట్టారు. ఈ దృశ్యాలు అన్ని న్యూస్ ఛానెళ్లలో వచ్చాయి. అప్పుడు పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని, ఆ రోజుని మర్చిపోలేనని బాల్కసుమన్ చెబుతూ ఆ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.