తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్‌!

  • డ‌బ్బింగ్ రూంలో దిగిన‌ ఫొటో పంచుకున్న కీర్తి
  • 'అజ్ఞాత వాసి' చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించిన భామ‌
  • పొగిడేస్తున్న నెటిజ‌న్లు
నిత్యా మీన‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ల బాట‌లో మ‌రో మ‌ల‌యాళీ భామ కీర్తి సురేశ్ కూడా చేరిపోయింది. తెలుగులో తొలిసారి తాను న‌టించిన సినిమాకు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది కీర్తి సురేశ్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న‌, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె న‌టించిన `అజ్ఞాత వాసి` చిత్రంలో ఆమె భాగానికి డ‌బ్బింగ్ పూర్త‌యింది. ఈ విష‌యాన్ని కీర్తి ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంది.

'మొద‌టిసారి తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌డం పూర్త‌యింది. ఇప్పుడు నాకు సంపూర్ణంగా అనిపిస్తోంది' అని కీర్తి ట్వీట్ చేసింది. డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో దిగిన ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. ఆ ఫొటోలో క‌నిపిస్తున్న మానిటర్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కూడా చూడొచ్చు.
dubbing
keethy suresh
Pawan Kalyan

More Telugu News