సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'లండన్ నుంచి వచ్చేస్తున్నా'నంటున్న శ్రుతి హాసన్
  • కీర్తి సురేశ్ తో కలసి సూర్య 'గ్యాంగ్'!
  •  గోవాలో మణిరత్నం సినిమా మ్యూజిక్ సిటింగ్స్ 
  • హిట్ చిత్రాల దర్శకుడితో రవితేజ 
*  గత కొన్నాళ్లుగా లండన్ లో షికార్లు చేస్తున్న అందాలభామ శ్రుతి హాసన్ కి ఇంటి మీదకు మనసు లాగిందేమో చెన్నై వచ్చేస్తున్నట్టు పేర్కొంది. 'చెన్నై కాలింగ్, ఫ్యామిలీని కలవాలి, పని కూడా వుంది' అంటూ చెప్పింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో కొత్త సినిమాలు ఏవీ లేవు కాబట్టి, తండ్రి తీస్తున్న 'శభాష్ నాయుడు' సినిమా షూటింగ్ మొదలవుతోందని మనం అనుకోవాలి.
*  తమిళ నటుడు సూర్య హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తానా సెరింద కొట్టం' చిత్రాన్ని తెలుగులో కూడా ఏక కాలంలో నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి 'గ్యాంగ్' అనే పేరు నిర్ణయించినట్టు సమాచారం. సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్నాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో జరుగుతున్న ఈ పాటల కంపోజింగ్ లో దర్శకుడు మణిరత్నం, తమిళ గేయ రచయిత వైరముత్తు పాల్గొంటున్నారు.
*  వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారిన రవితేజ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాల దర్శకుడు కల్యాణ్ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తాడు.    
Shruti Hassan
Keerthi
Maniratnam
Raviteja

More Telugu News