సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- దక్షిణాది హీరోయిన్ బయోపిక్ లో రాయ్ లక్ష్మి
- మాధవన్ కు వెల్కం చెప్పిన యూనిట్
- యూ ట్యూబ్ లో బన్నీ సినిమా దూకుడు
- మల్టీ స్టారర్ ప్లానింగ్ లో హరీష్ శంకర్
* నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'సవ్యసాచి' చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోన్న మాధవన్ నిన్న ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. దీంతో యూనిట్ అంతా ఎగ్జయిటింగుతో ఆయనకు స్వాగతం చెప్పింది.
* హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం' చిత్రం హిందీ వెర్షన్ యూ ట్యూబ్ లో రికార్డు దిశగా సాగుతోంది. ఈ చిత్రాన్ని గోల్డ్ మెయిన్ ఫిలిమ్స్ తమ యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేయగా, ఒక్క రోజులోనే 10 మిలియన్ల వ్యూస్ ను ఇది దాటేసింది.
* నితిన్, శర్వానంద్ కలసి ఓ చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ వీరిద్దరితోనూ ఓ మల్టీ స్టారర్ రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు. హరీష్ చెప్పిన కథకు వీరిద్దరూ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.