'అజ్ఞాతవాసి' ఫస్టులుక్ విడుదల తేదీ ఖరారు!
- ఈ నెల 25న 'అజ్ఞాతవాసి' ఫస్టులుక్
- వచ్చేనెల 15వ తేదీన ఆడియో రిలీజ్
- జనవరి 10వ తేదీన సినిమా విడుదల
ఈ నెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజున ఈ సినిమా నుంచి ఫస్టు సాంగ్ ను వదిలారు. ఆ సాంగ్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఫస్టులుక్ ద్వారా మరింతగా అంచనాలు పెంచే పనిలో ఈ సినిమా టీమ్ వుంది. అనిరుధ్ అందించిన ఆడియోను వచ్చేనెల 15వ తేదీన విడుదల చేసి, సినిమాను జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.