సంజయ్ లీలా భన్సాలీని పెళ్లి చేసుకుంటా... బిగ్‌బాస్ ఫన్నీ గేమ్‌లో భాగంగా వెల్లడించిన దీపికా పదుకునే
- డేట్, మ్యారీ, కిల్ గేమ్ ఆడించిన సల్మాన్ ఖాన్
- ఆకట్టుకున్న సల్లూ భాయ్, దీపికాల ఆఫ్‌బీట్ డ్యాన్స్
- 'పద్మావతి' ప్రచారం కోసం బిగ్‌బాస్ కార్యక్రమానికి విచ్చేసిన నటి
అందుకు దీపికా... భన్సాలీని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దానికి కంగుతిన్న సల్మాన్... 'సరే! కొన్ని రోజుల వరకైతే ఓకే' అంటూ కౌంటర్ వేశాడు. తర్వాత దీపికా... రణ్‌వీర్‌తో డేట్ చేస్తానని, షాహిద్‌ని చంపుతానని చెప్పింది. షాహిద్ ను ఎందుకు చంపాలనుకుంటున్నావని సల్మాన్ అడగ్గా.. అతనికి పెళ్లైంది కదా?... అంటూ చమత్కరించింది. తర్వాత ఇద్దరూ కలిసి ఆఫ్‌బీట్ డ్యాన్స్ వేశారు. పాటకి సంబంధం లేకుండా డ్యాన్స్ వేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.