ఆసుపత్రిలో కాంగ్రెస్ నేత జానారెడ్డి... పరామర్శించిన నాయిని, హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసుపత్రిలో కాంగ్రెస్ నేత జానారెడ్డి... పరామర్శించిన నాయిని, హరీశ్ రావు

  • అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జానారెడ్డి
  • యశోదా హాస్పిటల్ లో చికిత్స
  • విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు
అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కే జానారెడ్డి ఆసుపత్రిలో చేరారు. ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు యశోదా ఆసుపత్రిలో చేర్చారు. జానారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావులు యశోద హాస్పిటల్ కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వారి వెంట మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌ రెడ్డి కూడా ఉన్నారు. జానారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హరీశ్ రావు వైద్యులను వాకబు చేశారు.
k janareddy
yasoda hospital
Harish Rao
nayini

More Telugu News