నేను చాలా గౌరవించే మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు... నయనతారపై ట్వీట్ చేసిన దర్శకుడు విఘ్నేశ్!
- ఇవాళ నయనతార పుట్టినరోజు
- వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు
- అనుమానాలు నిజం చేసిన దర్శకుడి ట్వీట్
'నేను ఎంతో గౌరవించే మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే ధైర్యంగా, అందంగా ఉండు. నయనతార అంటే ఏంటో చూపిస్తూ ఉండు. నిన్ను చూస్తే ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది. నా ప్రేమ, గౌరవం నీకే నా తంగమ్మే' అని విఘ్నేశ్ ట్వీట్ చేశాడు. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను కూడా విఘ్నేశ్ షేర్ చేశాడు. ఇటీవల నయనతార నటించిన 'ఆరమ్' సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.