roja: జగన్ నాకు హోం మంత్రి పదవి ఇస్తే స్వీకరిస్తాను!: ఎమ్మెల్యే రోజా
- జగన్ ఇస్తారని మనం ఆశపడకూడదు
- ఒకవేళ నేను హోంమంత్రి అయితే మహిళలకు న్యాయం చేస్తాను
- నేరస్తులని తరిమికొట్టాల్సి ఉంది
- నన్ను గెలవనివ్వకూడదన్నదే టీడీపీ ఆలోచన
ఎంత ఖర్చైనా తనను నగరిలో మరోసారి గెలవనివ్వకూడదని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి వచ్చి తనకు హోం మంత్రి పదవి ఇస్తే చేస్తానని అన్నారు. కానీ, జగన్ ఇస్తారని మనం ఆశపడకూడదని అన్నారు. ఒకవేళ జగన్ తనకు హోం మంత్రిగా అవకాశం ఇస్తే, మహిళలకు న్యాయం చేస్తానని అన్నారు.
తాను 2004 నుంచి మహిళల గురించి పోరాడుతున్నానని చెప్పారు. మహిళలకు నష్టం కలిగిస్తోన్న ప్రతి అంశంపై పోరాడుతూ వస్తున్నానని తెలిపారు. నేరస్తులని తరిమికొట్టాల్సి ఉందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కలకాలం నిలబెట్టాలని జగన్ కష్టపడుతున్నారని రోజా చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో కేసుల నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ముందు తాకట్టు పెట్టారని అన్నారు.