ప్రసంగం మధ్యలో మంచినీళ్లు తాగిన ట్రంప్... గతాన్ని తవ్వుతున్న నెటిజన్లు!
- మూతిపెట్టి చిన్నపిల్లాడిలా మంచినీళ్లు తాగిన డొనాల్డ్
- గతంలో సెనేటర్ రూబియోను హేళన చేసిన అమెరికా అధ్యక్షుడు
- వైరల్ చేస్తున్న నెటిజన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ కు వ్యతిరేకంగా పోటీ చేసిన సెనేటర్ మార్కొ రూబియో కూడా ఓ సారి ప్రసంగం మధ్యలో మంచి నీళ్లు తాగాడు. ఆ విషయాన్ని ప్రచార సమయాల్లో గుర్తు చేసి రూబియోను ట్రంప్ హేళన చేశాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రసంగం మధ్యలో చిన్నపిల్లాడిలా మూతి పెట్టి మంచి నీళ్లు తాగడంతో గతాన్ని గుర్తు చేసి మరీ అతన్ని ట్విట్టర్ జనాలు హేళన చేస్తున్నారు.