అర్జున్ రెడ్డి త‌మిళ రీమేక్ కోసం హీరోయిన్ కావాల‌ట‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అర్జున్ రెడ్డి త‌మిళ రీమేక్ కోసం హీరోయిన్ కావాల‌ట‌!

  • వీడియో పోస్ట్ చేసిన విక్రమ్‌
  • 'వ‌ర్మ' పేరుతో రీమేక్ అవుతున్న చిత్రం
  • వీలైనంత త్వ‌ర‌గా ఎంట్రీలు పంపాల‌ని కోరిన హీరో
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని త‌మిళంలో విక్ర‌మ్ కుమారుడు ధ్రువ్ హీరోగా 'వర్మ' పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అయితే ఈ సినిమాలో న‌టించేందుకు ఇంకా హీరోయిన్ దొర‌క‌లేద‌ట‌. దీంతో కొత్త హీరోయిన్ కోసం వారు వెతుకులాట ప్రారంభించారు.

హీరోయిన్ కావాలంటూ ఓ వీడియోను ధ్రువ్ త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇందులో త‌మ హీరోయిన్ కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌ను వివ‌రించారు. ఈ వీడియోకు న‌టి శ్రుతి హాస‌న్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చింది. వీలైనంత త్వ‌ర‌గా ఆడిష‌న్ ఎంట్రీల‌ను పంపించాలని విక్రమ్ కోరాడు. అందుకోసం ఒక మెయిల్ ఐడీని కూడా ఇచ్చాడు. మ‌రి ఇంకా ఆల‌స్యం ఎందుకు? పంపించేయండి!
arjun reddy
tamil remake
varma
vikram
dhruv
casting call

More Telugu News