Chandrababu: విమానాశ్రయం నుంచి నేరుగా బోటు ప్రమాదస్థలికి వెళ్లిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
విజయవాడ వద్ద కృష్ణా నదిలో నిన్న సాయంత్రం జరిగిన పడవ ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి అమరావతిలో లేరు. కేరళ పర్యటనకు ఆయన వెళ్లారు. కాసేపటి క్రితం విజయవాడకు చేరుకున్న ఆయన... నేరుగా బోటు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రస్తుతం ఆయన పరిశీలిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రులు కామినేని శ్రీనివాస్, భూమా అఖిలప్రియ, కొల్లు రవీంద్రలతో పాటు పలువురు నేతలు, విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఘటనా స్థలిలో ప్రత్యక్ష సాక్షులతో కూడా ఆయన మాట్లాడారు. కాసేపట్లో ఆయన ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలుసుకుని, వారిని పరామర్శించనున్నారు.
Go Back to Shorts
Chandrababu
ap cm
vijayawada boat accident

More Telugu News