యాడ్ కు పారితోషికంగా వచ్చిన 50 లక్షలను విరాళంగా ఇచ్చేసిన తమిళ హీరో!
Add ap7am to your home Screen

యాడ్ కు పారితోషికంగా వచ్చిన 50 లక్షలను విరాళంగా ఇచ్చేసిన తమిళ హీరో!

  • 'అనిల్‌ సేమియా' కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి
  • 50 లక్షల పారితోషికం విరాళంగా ఇచ్చేసిన వైనం 
  • 774 అంగన్వాడీలు, 10 అంధుల పాఠశాలలు, 11 బధిరుల పాఠశాలలకు విరాళం
తమిళనాట సినీనటులకు రాజకీయ, సామాజిక చైతన్యం ఎక్కువన్న సంగతి తెలిసిందే. దీనిని ఎంజీఆర్ నుంచి విశాల్ వరకు పలువురు నటీనటులు నిరూపిస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. తాజాగా కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇంతవరకు ఏ హీరో చేయని పని చేసి తమిళులను ఆకట్టుకున్నాడు. తమిళనాడులోని 'అనిల్‌ సేమియా' కంపెనీకి ప్రచారకర్తగా ఉండేందుకు విజయ్‌ సేతుపతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజాగా ఈ సంస్థ ఐదు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా దిండుగల్‌ లో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది.

 ఇందులో ఈ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ సేతుపతి పాల్గొని వాటిని లాంఛనంగా ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా 50 లక్షల రూపాయల పారితోషికాన్ని సంస్థ అతనికి అందజేసింది. ఈ మొత్తాన్ని విజయ్ సేతుపతి తీసుకోకుండా విద్య, మౌలిక వసతుల కల్పనలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా తమిళనాట పేరొందిన అరియలూర్‌ లోని 774 అంగన్వాడీలు, 10 అంధుల పాఠశాలలు, 11 బధిర పాఠశాలలకు విరాళంగా ఇచ్చేశాడు. ఒక్కో అంగన్వాడీకి 5,000 రూపాయలిచ్చిన సేతుపతి, ఒక్కో అంధుల, బధిర పాఠశాలకు 50,000 రూపాయల చొప్పున విరాళంగా ఇచ్చాడు.  
vijay sethupaty
kollywood
donation

More Telugu News