చంద్రబాబుది హలూసినేషన్ - సిక్స్ స్టేజ్... తెదేపాపై రెచ్చిపోయిన రోజా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుది హలూసినేషన్ - సిక్స్ స్టేజ్... తెదేపాపై రెచ్చిపోయిన రోజా!

  • కష్టాలు తెలుసుకునే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తుంటే విమర్శలా?
  • ఒక్క హామీని కూడా అమలు చేయని చరిత్ర చంద్రబాబుది
  • దోచుకున్నది దాచుకోవడం తప్ప మరేమైనా చేశారా?
  • నిప్పులు చెరిగిన వైకాపా ఎమ్మెల్యే రోజా
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఆకాంక్ష, వాటిని పరిష్కరించాలన్న తపన ఉండబట్టే, తమ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఈ యాత్రను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర భయాందోళన చెందుతున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆమె, ఏ సమస్యా లేదని చంద్రబాబు చెబుతున్నారని, రుణమాఫీ చేశానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చానని, ఎస్సీఎస్టీలకు భూములు ఇచ్చానని, పెన్షన్లు ఇచ్చానని, అందరికీ అన్నీ చేశానని చెప్పడాన్ని ఆమె ఎద్దేవా చేస్తూ, హలూసినేషన్ సిక్స్ స్టేజ్ లో చేయనివన్నీ చేసినట్టుగా అలా అనిపిస్తుందని, చంద్రబాబుకు ఇప్పుడదే జబ్బు పట్టుకుందని నిప్పులు చెరిగారు.

ఏం చేయని చంద్రబాబు, అన్నీ చేసినట్టు చెప్పుకుంటున్నారని, చంద్రబాబుకు ధైర్యముంటే జగన్ తో పాటు నడిచి, ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందో చూపించాలని రోజా సవాల్ విసిరారు. ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జరిగిందా? అని మండిపడ్డారు. పూర్తి రైతు రుణ మాఫీ జరగలేదని, ఆడపడుచులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్న బంగారం ఇంకా బయటకు రాలేదని, మీకు రాష్ట్రాన్ని దోచుకుని, ఫారిన్ లో దాచుకోవడం తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
roja
Telugudesam
chandrababu
YSRCP
ys jagan

More Telugu News