సికింద్రాబాద్ రైల్ నిల‌యంలో అగ్ని ప్ర‌మాదం!

  • 10 నిమిషాల పాటు చెల‌రేగిన మంట‌లు
  • ప్ర‌మాద‌స్థ‌లిలోనే ఓ గ్యాస్ సిలిండ‌ర్
  • త‌ప్పిన ప్ర‌మాదం.. ఊపిరి పీల్చుకున్న సిబ్బంది
సికింద్రాబాద్‌ రైల్ నిల‌యంలోని ఏడో అంత‌స్తులో మంట‌లు చెల‌రేగాయి. 10 నిమిషాల పాటు చెలరేగిన మంట‌లతో ఉద్యోగులు, సిబ్బంది ఆందోళ‌న చెందారు. రైల్ నిల‌యంలోని పై క‌ప్పుల‌కు మ‌ర‌మ్మ‌తులు చేస్తుండ‌గా అగ్ని ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు తెలిసింది. వెంట‌నే స్పందించిన రైల్వే సిబ్బంది ఆ మంట‌ల‌ను ఆర్పేశారు. ప్ర‌మాద స్థ‌లంలోనే గ్యాస్ సిలిండ‌ర్ ఉండ‌డంతో అక్క‌డి ఉద్యోగులు కంగారు ప‌డ్డారు. అయితే, దానికి మంటలు అంటుకోక‌పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ సిలిండ‌ర్ కూడా పేలి ఉంటే పెను ప్ర‌మాదం జ‌రిగి ఉండేది.
Go Back to Shorts
railway station
secunderabad
fire accident

More Telugu News