రానాతోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రానాతోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ!

  • 'ఫిదా'తో హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల
  • ఆయన తదుపరి సినిమాపై అందరిలోను ఆసక్తి
  • రానాకి లైన్ వినిపించిన కమ్ముల 
  • పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో బిజీ    
ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై భారీ విజయాన్ని సాధించిన చిత్రాలలో 'ఫిదా' ఒకటి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా విజయవిహారం చేసింది. దాంతో శేఖర్ కమ్ముల తదుపరి సినిమా ఎవరితో వుండనుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమా రానాతో వుండనుందనే టాక్ వినిపిస్తోంది.

 ముందు నితిన్ తో గానీ .. విజయ్ దేవరకొండతో గాని ఒక సినిమా చేద్దామని శేఖర్ కమ్ముల అనుకున్నాడట. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో, రానాతోనే సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఆల్రెడీ ఆయన రానాకి ఒక లైన్ వినిపించడం .. ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో శేఖర్ కమ్ముల వున్నాడని చెబుతున్నారు. అయితే అంతా అనుకుంటున్నట్టుగా ఇది 'లీడర్' సీక్వెల్ కాదు .. కొత్త కథ.  
sekhar kammula

More Telugu News