ఐఫోన్ ఎక్స్ అమ్మకాలతో భారీగా లాభపడిన ఆపిల్?
- ఫోన్ తయారీకి అయిన ఖర్చు రూ. 23,200
- ఫోన్ అమ్మకపు ధర రూ. 64,800
- లెక్కలు అంచనా వేసిన టెక్ఇన్‌సైట్స్ సంస్థ
అయితే టెక్ఇన్‌సైట్స్ కథనాలపై స్పందించేందుకు ఆపిల్ సంస్థ నిరాకరించింది. అయితే తమ అంచనాలకు మద్దతుగా ఐఫోన్ ఎక్స్‌లో ఉపయోగించిన విడిభాగాల ధరలను కూడా టెక్ఇన్‌సైట్స్ వెల్లడించింది. ఐఫోన్ ఎక్స్‌లో వాడిన 5.8 ఇంచుల డిస్‌ప్లేకి 65.50 డాలర్లు (రూ. 4,300), బాడీ తయారీకి ఉపయోగించిన స్టెయిన్‌లెస్ స్టీల్‌కి 36 డాలర్లు (రూ. 2,300) అయి ఉంటుందని టెక్ఇన్‌సైట్స్ తెలిపింది.