పెద్ద పులిని చూసి ఓ నక్క 'దొంగ పాదయాత్రలు' చేసింది: చంద్రబాబుపై కొడాలి నాని విసుర్లు
- చంద్రబాబుపై విమర్శలు
- పగలు బస్సులో పడుకుని, రాత్రిపూట దొంగ యాత్రలు చేశారు
- పాదయాత్ర అంటే గుర్తొచ్చేది వైయస్సే
పెద్ద పులిలాంటి వైయస్ ను చూసి... ఈ రాష్ట్రంలో ఓ నక్క దొంగ యాత్రలు చేసిందంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పగలంతా బస్సులో పడుకుని, రాత్రిపూట దొంగ పాదయాత్రలు చేశారంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసమే జగన్ పాదయాత్ర చేపడుతున్నారని... ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలన్నింటినీ జగన్ పరిష్కరిస్తారని చెప్పారు. ఇడుపులపాయ సభలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.