క‌మ‌ల్‌ లాంటి వారిని కాల్చి చంపేయాలి: అఖిల భార‌త హిందూ మ‌హాస‌భ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క‌మ‌ల్‌ లాంటి వారిని కాల్చి చంపేయాలి: అఖిల భార‌త హిందూ మ‌హాస‌భ

  • కమల్ ను ఉరి తీయాలి: భార‌త హిందూ మ‌హాస‌భ 
  • క‌మ‌ల హాస‌న్‌పై దాడి చేసిన వారికి రూ.25,000 ఇస్తాం: అలీగ‌ఢ్‌ ముస్లిం యూత్ అసోసియేష‌న్
  • ఇటువంటి వారి నాలుక కోసేయాలి: అసోసియేష‌న్ లీడ‌ర్ మ‌హ్మ‌ద్ ఆమిర్ ర‌షీద్
సినీన‌టుడు క‌మ‌ల హాసన్‌లాంటి వారిని కాల్చి చంపేయాలని, లేక‌పోతే ఉరి తీయాల‌ని అఖిల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని భార‌త హిందూ మ‌హాస‌భ ముఖ్య‌నేత అశోక్ శ‌ర్మ అన్నారు. ఈ రోజు ఆయ‌న ల‌క్నోలో మాట్లాడుతూ హిందువుల‌ని ఉగ్ర‌వాదులంటూ వ్యాఖ్య‌లు చేస్తోన్న వారు ఎవ‌రైనా స‌రే వారిని క్ష‌మించ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. క‌మ‌ల హాస‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై హిందువులే కాదు ప‌లువురు ముస్లిం నేత‌లు కూడా మండిప‌డుతున్నారు.

అలీగ‌ఢ్‌లోని ముస్లిం యూత్ అసోసియేష‌న్ లీడ‌ర్ మ‌హ్మ‌ద్ ఆమిర్ ర‌షీద్ ఇదే విష‌యంపై మాట్లాడుతూ.. క‌మ‌ల హాస‌న్‌పై దాడి చేసిన వారికి రూ.25,000 ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేశారు. ఒక‌వేళ హిందువులు ఉగ్ర‌వాదులే అయితే భార‌త దేశంలో ఏ ఇత‌ర మ‌త‌స్తులు ఇంత సుర‌క్షితంగా ఉండ‌లేక‌పోయేవార‌ని ఆయ‌న అన్నారు. ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తూ మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టే వారి నాలుకలు కోసేయాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
Kamal Haasan
Hindu
Muslim

More Telugu News