'పద్మావతి' ట్రైలర్ విజయాన్ని సెలబ్రేట్ చేయనున్న దీపికా పదుకునే
- బాలీవుడ్ ప్రముఖులందరికీ ఇవాళ సాయంత్రం పార్టీ
- సోషల్ మీడియాలో 50 మిలియన్లకి పైగా వీక్షణలు సంపాదించిన ట్రైలర్
- దీపికా పాటకు కూడా మంచి స్పందన
ముంబైలోని తన ఇంట్లో దీపికా ఈ పార్టీ ఇవ్వనుంది. ఈ పార్టీకి పద్మావతి నటులు రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీలతో పాటు షారుక్ ఖాన్, గౌరీ ఖాన్, కరణ్ జొహార్, ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఆదిత్యరాయ్ కపూర్, నిర్మాత కపిల్ చోప్రా, దర్శకుడు అభయ్ చోప్రాలు హాజరుకానున్నారు.
ట్రైలర్ తర్వాత విడుదలైన పద్మావతి పాట 'ఘూమర్'కి కూడా సోషల్ మీడియాలో చాలా వీక్షణలు వస్తున్నాయి. ఇందులో దీపికా నృత్య ప్రదర్శన అద్భుతంగా ఉందని తనను కలిసిన ప్రతి ఒక్కరు ఆమెతో అంటున్నారట.