వంతల రాజేశ్వరికి పచ్చ కండువా కప్పిన చంద్రబాబు!
Add ap7am to your home Screen

వంతల రాజేశ్వరికి పచ్చ కండువా కప్పిన చంద్రబాబు!

  • పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
  • అభివృద్ధి కోసమే టీడీపీలోకి
  • చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తా
  • మీడియాతో వంతల రాజేశ్వరి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై రంపచోడవరం నుంచి పోటీచేసి విజయం సాధించిన వంతల రాజేశ్వరి, ఆ పార్టీ అధినేతకు షాకిస్తూ, పార్టీ ఫిరాయించారు. చంద్రబాబు వద్దకు వచ్చిన ఆమె, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు స్వాగతం పలికిన చంద్రబాబు, పచ్చ కండువాను కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ, నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశంలో చేరినట్టు తెలిపారు.

చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో ఇకపై నడుస్తానని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా ఐదు స్థానాలను గెలుచుకోగా, ఇప్పటికే జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు టీడీపీలో చేరిపోయారు. తాజాగా రాజేశ్వరి కూడా వారి వెంటే నడవడంతో, వైసీపీ బలం రెండుకు తగ్గింది. ఆమెతో సహా ఇప్పటివరకూ 22 మంది టీడీపీలో చేరగా, మరో రెండు రోజుల్లో ఇంకో నలుగురైదుగురిని టీడీపీలోకి తీసుకొచ్చి, జగన్ ను నైతికంగా దెబ్బతీయాలన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. కాగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నడిపించిన మంత్రాంగం ఫలితమే రాజేశ్వరిని తెలుగుదేశం పార్టీలో చేర్చిందని అంచనా. 
chandrababu
tTelugudesam leaders
vantala rajeshwari

More Telugu News