టీచర్ సరితతో మాట్లాడి, ఆ టేపులు లీక్ చేసి, నారాయణ కాలేజీ పరువు తీసిన నవీన్ అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీచర్ సరితతో మాట్లాడి, ఆ టేపులు లీక్ చేసి, నారాయణ కాలేజీ పరువు తీసిన నవీన్ అరెస్ట్!

  • సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న ఉప్పల్ పోలీసులు
  • విచారిస్తున్న ఉన్నతాధికారులు
  • నోరు విప్పితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయనంటున్న పోలీసు వర్గాలు
హైదరాబాద్, రామాంతపూర్ లోని నారాయణ కాలేజీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన సెల్ ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాలకు ఎక్కి వైరల్ అయి, కాలేజీ పరువును నడి వీధిలో నిలిపిన వేళ, యాజమాన్యం పెట్టిన కేసుపై స్పందించిన పోలీసులు ఘటనకు బాధ్యుడిని అరెస్ట్ చేశారు. టీచర్ సరితా అగర్వాల్ తో మాట్లాడి, ఆ మాటలు రికార్డు చేసి, కావాలనే బయటకు వదిలాడని భావిస్తున్న కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నవీన్,  సిరిసిల్లలో ఉన్నాడని గుర్తించిన ఉప్పల్ పోలీసులు ఈ ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

నవీన్ ను విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ కు తరలించారు. అతను నోరువిప్పితే నారాయణ సంస్థల లోగుట్టు బయటపడే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఆరోపణలు ఎదుర్కొంటున్న జయసింహారెడ్డి, వెంకటరెడ్డి, , రమేష్, సతీశ్ పాత్రలపై ఇప్పటికే నారాయణ యాజమాన్యం అంతర్గత విచారణ చేపడుతుండగా, పోలీసులు సైతం నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.
narayana
saritha
naveen

More Telugu News