nikhil: నిఖిల్ మూవీ సెట్ పైకి వెళ్లకుండానే సేల్ చేసేశారు!

షార్ట్స్‌లో చూడండి
యూత్ కి కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకుంటూ నిఖిల్ ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం 'కిరిక్ పార్టీ' రీమేక్ చేస్తోన్న ఆయన, త్వరలో 'కణితన్' అనే తమిళ సినిమా తెలుగు రీమేక్ చేయనున్నాడు. అధర్వ - కేథరిన్ జంటగా సంతోష్ తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమాను తెలుగులో నిర్మించడానికి ఠాగూర్ మధు రంగంలోకి దిగారు.

 అయితే సెట్స్ పైకి వెళ్లకముందే ఆయన ఈ ప్రాజెక్టును సేల్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఫస్టు కాపీని తమకి 11 కోట్లకి ఇవ్వమని ఓ పార్టీ అడిగిందట. ఆ డీల్ కి ఆయన ఓకే చెప్పాడని .. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందని అంటున్నారు. ఏడెనిమిది కోట్లలో ఆయన ఈ సినిమాను పూర్తి చేయగలిగితే, మిగిలినదంతా లాభమే. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.  
Go Back to Shorts
nikhil

More Telugu News