మోదీకి అభినంద‌న‌లు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చ‌ంద్ర‌బాబు
Add ap7am to your home Screen

మోదీకి అభినంద‌న‌లు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చ‌ంద్ర‌బాబు

  • సరళతర వాణిజ్యంలో ర్యాంక్‌ మెరుగుప‌ర్చుకున్న భార‌త్‌
  • చంద్ర‌బాబు నాయుడు హ‌ర్షం
  • మోదీ భార‌త‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత శ‌క్తిమంతంగా చేస్తున్నారు
సరళతర వాణిజ్యంలో భారత్ త‌న స్థానాన్ని మెరుగుప‌రుచుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సరళతర వాణిజ్యంలో ర్యాంకింగ్‌ను మెరుగుప‌డేలా చేసి, భార‌త‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత శ‌క్తిమంతంగా చేస్తున్నందుకు గానూ తాను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని అన్నారు. భార‌త్‌లో సరళతర వాణిజ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి 15 వ ర్యాంకు వ‌చ్చింద‌ని అన్నారు. భార‌త్ ర్యాంకును మెరుగుప‌ర్చుకోవ‌డం శుభసూచక‌మ‌ని చెప్పారు.
Chandrababu
Vijayawada

More Telugu News