rajasekhar: కథలో దమ్ముండాలే గానీ నెగెటివ్ రోల్స్ వచ్చినా చేస్తాను: రాజశేఖర్

షార్ట్స్‌లో చూడండి
రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'గరుడ వేగ' .. వచ్చేనెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ .. ఇది తన కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా అనీ, ఇందులో చాలా సహజంగా నటించానని చెప్పారు. ఈ సినిమాలో తాను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారిగా కనిపిస్తానని అన్నారు.

 తొలి సిటింగ్ లోనే ప్రవీణ్ సత్తారు తనని ఒప్పించాడనీ, మొదటి రోజు షూటింగ్ కి వెళ్లినప్పుడే ఆయనపై నమ్మకం పెరిగిందని చెప్పారు. ఈ సినిమా తరువాత సపోర్టింగ్ రోల్స్ వచ్చినా చేస్తానని, అయితే పాత్రలో సత్తా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కథలో దమ్ముండాలే గానీ .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు చేయడానికి కూడా సిద్ధమని అన్నారు. అలాగే 'ధ్రువ' సినిమాలో అరవింద్ స్వామి చేసిన విలన్ తరహా పాత్రలను కూడా చేస్తానని చెప్పారు.      
Go Back to Shorts
rajasekhar
pooja kumar

More Telugu News