శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి కూడా రేవంత్ రెడ్డి రాజీనామా
Add ap7am to your home Screen

శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి కూడా రేవంత్ రెడ్డి రాజీనామా

  • తెలంగాణ శాస‌న‌స‌భాప‌తి మ‌ధుసూద‌న‌చారికి రాజీనామా లేఖ
  • స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ 
  • రాజీనామా లేఖను నిన్నే రెడీ చేసి పెట్టుకున్న రేవంత్ రెడ్డి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏర్పాటు చేసిన‌ స‌మావేశంలో పాల్గొన‌డానికి విజ‌య‌వాడ‌కు వెళ్లిన రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న తెలంగాణ శాస‌న‌స‌భాప‌తి మ‌ధుసూద‌న‌చారికి లేఖ పంపారు. అయితే, తాను రాజీనామా చేయ‌డానికి గ‌ల కార‌ణాలను మాత్రం లేఖ‌లో పేర్కొన‌లేదు. రాజీనామా చేస్తున్నాను అనే విష‌యాన్ని మాత్ర‌మే లేఖ‌లో ప్ర‌స్తావించారు. స్పీకర్ ఫార్మాట్లోనే వున్న ఆ రాజీనామా లేఖను రేవంత్ రెడ్డి నిన్నే రెడీ చేసి పెట్టుకున్నారు. అక్టోబ‌ర్ 27, 2017 తేదీతో ఆ లేఖ ఉంది.
revant reddy
congress
l ramana
Telugudesam
chandrababu

More Telugu News