mahesh: మహేశ్ .. బన్నీల మధ్య పోటీ తప్పడం లేదు

షార్ట్స్‌లో చూడండి
కొరటాల శివ కథను చెప్పేతీరు .. కథనాన్ని నడిపించే విధానం బాగుంటాయి. అందువలన ఆయన సినిమాలు సాధారణ ప్రేక్షకులకు కూడా అరటిపండు ఒలిచినట్టు అర్థమవుతాయి. ఆయన తాజా చిత్రంగా 'భరత్ అను నేను' రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వలన కుదరకపోవడంతో, ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

 ఇక అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టు ముందుగానే చెప్పారు. దాంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చరణ్ 'రంగస్థలం' కూడా ఇంచుమించు ఆ సమయంలోనే వుంటుందనే టాక్ వినిపిస్తుండటం విశేషం.   
Go Back to Shorts
mahesh
allu arjun

More Telugu News