ఇష్టం లేకపోతే సినిమా చూడడం మానేయండి... ‘మెర్సల్’ సినిమాపై మద్రాసు హైకోర్టు కీలక తీర్పు!
- సినిమాను నిషేధించాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
- ఇష్టం లేకపోతే చూడడం మానేయాలంటూ పిటిషన్‌దారుడికి మొట్టికాయలు
- సినిమాలోని ‘దేవాలయం’ డైలాగుపై కోర్టుకెక్కిన లాయర్
‘‘దేవాలయాలను నిర్మించాల్సిన అవసరం లేదు. మాకు ఆసుపత్రులు కావాలి’’ అంటూ సినిమాలో చెప్పే డైలాగుపై మధురైకి చెందిన న్యాయవాది కోర్టుకెక్కారు. ఈ డైలాగు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాను నిషేధించాలని కోర్టును అభ్యర్థించారు. సినిమాను నిలిపివేయడంతో దానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు. విచారించిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ఇష్టం లేకపోతే సినిమా చూడడం మానేయాలని పిటిషన్‌దారుడికి మొట్టికాయలు వేసింది. అది ఏ ఒక్కరినో ఉద్దేశించి తీసిన సినిమా కాదని, అదో ఊహాత్మక చిత్రమని స్పష్టం చేసింది.