ప్రధానమంత్రి పదవిపై చంద్రబాబు స్పందన!
- గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్న చంద్రబాబు
- ప్రధాని అయ్యే అర్హతలు చంద్రబాబుకు ఉన్నాయన్న నిర్వాహకులు
- నా పరిమితులు ఏంటో నాకు తెలుసన్న బాబు
ఈ సందర్భంగా చంద్రబాబును సభికులకు పరిచయం చేస్తూ... భారత ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు చంద్రబాబుకు ఉన్నాయంటూ నిర్వాహకులు పేర్కొన్నారు. దీనికి సమాధానంగా, తాను ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడినని, తన పరిమితులు ఏంటో తనకు తెలుసని, ప్రధాని పదవికి తాను పోటీ కాదని, తన రాష్ట్రాన్ని ఉన్నతపథంలోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, పెట్టుబడులతో రావాలంటూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.