నా కొడుకు హిందూ కాదు, క్రిష్టియన్ కాదు.. భారతీయుడు.. పేరు అలా ఉంటే తప్పా?: హీరో విజయ్ తండ్రి
- విజయ్ క్రిష్టియన్ అని ఆరోపించిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా
- రాజా వ్యాఖ్యలపై మండిపడిన విజయ్ తండ్రి చంద్రశేఖర్
- విజయ్ ఒక మనిషి, అంతకు మించి భారతీయుడు
తన పేరు చంద్రశేఖర్ అని చెప్పిన ఆయన, తనది శివుడి పేరని తెలిపారు. విజయ్ క్రిస్టియనో లేక ముస్లిమో అదీ కాక హిందువో కాదని స్పష్టం చేశారు. విజయ్ ఒక మనిషి అని, అంతకుమించి భారతీయుడని ఆయన తెలిపారు. అసలు తనను అడిగితే ప్రజలకు సేవచేసేందుకు విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. విజయ్ నిర్ణయమే అంతిమమన్న ఆయన, తాను బలవంతం చేయనని అన్నారు. ‘మెర్సల్’ సినిమాలో చర్చనీయాంశమైన అంశాలను తొలగించేందుకు నిర్మాత అంగీకరించిన తరువాత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? అని ఆయన మండిపడ్డారు.