భారీగా పెరిగిన రవితేజ పారితోషికం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీగా పెరిగిన రవితేజ పారితోషికం?

  • 'రాజా ది గ్రేట్' కి సక్సెస్ టాక్
  • రవితేజలో తగ్గని జోష్ 
  • భారీ రేటుకు శాటిలైట్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ 
  • రవితేజకి పెరుగుతోన్న ఆఫర్లు        
'రాజా ది గ్రేట్' చూసినవాళ్లు .. రవితేజ కొంత గ్యాప్ తీసుకున్నా, సరైన సినిమాతోనే వచ్చాడని చెప్పుకుంటున్నారు. రవితేజ ఇంత గ్యాప్ తీసుకున్నా ఆయన జోష్ ఎంత మాత్రం తగ్గలేదని అంటున్నారు. ఆయన టైమింగ్ లో ఎంతమాత్రం మార్పు రాలేదని చెబుతున్నారు. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ తో రవితేజకి పూర్వవైభవం వచ్చేసినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 ఈ నేపథ్యంలో ఆయనతో సినిమాలు చేయడానికి కొంతమంది నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారట. త్వరలో ఆయన నల్లమలుపు బుజ్జి నిర్మాణంలోను .. బండ్ల గణేశ్ నిర్మాణంలోను .. మైత్రీ మూవీస్ బ్యానర్ లోను సినిమాలు చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో రవితేజ తన పారితోషికాన్ని 10 కోట్ల నుంచి 13 కోట్లకు పెంచేయనున్నట్టు సమాచారం. 'రాజా ది గ్రేట్' సక్సెస్ టాక్ .. ఆ సినిమా శాటిలైట్ రైట్స్ 11 కోట్లు .. హిందీ డబ్బింగ్ రైట్స్ 7 కోట్లు పలకడం .. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెప్పుకుంటున్నారు.       
raviteja

More Telugu News