నా కొడుకు నా దగ్గరే పోజు కొడుతున్నాడు: రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కొడుకు నా దగ్గరే పోజు కొడుతున్నాడు: రవితేజ

  • 'రాజా ది గ్రేట్'లో నటించిన రవితేజ కుమారుడు మహాధన్
  • హీరో చిన్నప్పటి పాత్రలో మెప్పించిన మహాధన్
  • మహాధన్ నటనకు ప్రశంసలు
  • సినిమా సక్సెన్ మీట్ లో రవితేజ
తన తాజా చిత్రం 'రాజా ది గ్రేట్'లో నటించిన తన కుమారుడు మహాధన్ ఇప్పుడు తన వద్దే పోజులు కొడుతున్నాడని హీరో రవితేజ వ్యాఖ్యానించారు. సినిమాలో చిన్నప్పటి రవితేజగా నటించిన మహాధన్ నటనకు ప్రశంసలు దక్కుతుండగా, ఆ పుత్రోత్సాహం రవితేజలో స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా హిట్ కావడంతో సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ నిర్వహించగా, రవితేజ మాట్లాడారు. తనను దర్శకుడు, దర్శకుడిని తాను గట్టిగా నమ్మడం వల్లనే ఇంత మంచి సినిమా వచ్చిందని చెప్పారు.

తన కుమారుడి నటనను మెచ్చుకుంటూ పలువురు ఫోన్ కాల్స్ చేస్తుంటే వాడు పొంగిపోతున్నాడని అన్నారు. వాడి సెల్ ఫోన్ కు ఎన్నో మెసేజ్ లు వస్తున్నాయని చెప్పారు. గత నాలుగు రోజులుగా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పారు. సినిమాలోని ఒక్కో డైలాగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారని, రెండోసారి, మూడోసారి చూసేందుకు కూడా ప్రేక్షకులు వస్తున్నారని తెలుసుకుంటే తన ఆనందం మరింతగా పెరుగుతోందని రవితేజ అన్నారు. కొంత విరామం తరువాత ఈ చిత్రం వచ్చిందని చెప్పిన రవితేజ, తాను కావాలని విరామం తీసుకోలేదని చెప్పారు. మెహరీన్ ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా మారిపోయిందని కితాబిచ్చారు.
raja the great
raviteja
mahadhan

More Telugu News