సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • హారర్ సినిమాలు చేయనంటున్న లావణ్య 
  • నిఖిల్ సరసన సిమ్రన్ పరీంజ 
  • 'లవర్' పాత్రలో రాజ్ తరుణ్ 
  • 'మహానటి'లో నాటి రచయితగా నేటి రచయిత!
*  ఏ సినిమా అయినా చేస్తాను కానీ, హారర్ సినిమాలు మాత్రం చేయనని అంటోంది అందాలతార లావణ్య త్రిపాఠి. "హారర్ సినిమాలు ఇష్టమే ...చూస్తుంటాను. కానీ, అలాంటి సినిమాలు చేయడం మాత్రం నా వల్ల కాదు. అందుకే, వాటి జోలికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను" అని చెప్పింది లావణ్య.
*  యంగ్ హీరో నిఖిల్ సరసన సిమ్రన్ పరీంజ కథానాయికగా ఎంపికైంది. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రంలో సిమ్రన్ ను రెండో నాయికగా ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన నాయికగా సంయుక్త హెగ్డే నటిస్తోంది.
*  రాజ్ తరుణ్ హీరోగా 'అలా ఎలా' ఫేం అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి 'లవర్' అనే టైటిల్ని ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం షూటింగు ఈ రోజు నుంచి జరుగుతుంది.
*  కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అన్వేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మహానటి' చిత్రంలో అప్పటి ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావు పాత్రను నేటి ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ పోషిస్తారు. ఇప్పటికే ఈ చిత్రంలో కేవీ రెడ్డిగా క్రిష్, సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్ నటించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.
Lavanya
nikhil
raj tarun
keerthi

More Telugu News