kcr: నేడు వరంగల్‌లో కేసీఆర్ పర్యటన.. మూడువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు (ఆదివారం) వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మూడువేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాకతీయ వస్త్ర పరిశ్రమ ప్రాంగణంలో నిర్వహించనున్న బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు ఐదు దారులను గుర్తించి పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు. మహిళలు కూర్చునేందుకు 60 వేల కుర్చీలను సిద్ధం చేశారు. 8 ఎల్‌ఈడీ స్క్రీన్లు, 72 సీసీ కెమెరాలు, పార్కింగ్ స్థలాల్లో 60 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అలాగే ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచారు. సభ సజావుగా సాగేందుకు అవసరమైన బందోబస్తు చేపట్టినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.
Go Back to Shorts
kcr
telangana
cm
warangal

More Telugu News