హిట్ కాంబినేషన్ ను సెట్ చేస్తోన్న దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిట్ కాంబినేషన్ ను సెట్ చేస్తోన్న దిల్ రాజు

  • హిట్ కాంబినేషన్ ను సెట్ చేయడంలో దిల్ రాజు సిద్ధహస్తుడు 
  • గతంలో 'కార్తికేయ'తో హిట్ కొట్టిన నిఖిల్ - చందూ 
  • ప్రస్తుతం 'కిరిక్ పార్టీ'తో నిఖిల్ బిజీ 
  • 'సవ్యసాచి' పనుల్లో చందూ
నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో ఒకటిగా 'కార్తికేయ' కనిపిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే కోరిక ఇటు నిఖిల్ కి .. అటు చందూ మొండేటికి కూడా వుంది. కానీ అందుకు పరిస్థితులు కలిసి రాలేదు. ఈ ఇద్దరితో ఒక సినిమా చేయడానికి దిల్ రాజు రెడీగా ఉన్నారనేది తాజా సమాచారం.

నిర్మాతగా .. పంపిణీదారుడిగా దిల్ రాజుకు గల అనుభవాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. హిట్ కాంబినేషన్ ను సెట్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రస్తుతం చైతూతో చందూ మొండేటి 'సవ్యసాచి' చేస్తున్నాడు. ఇక నిఖిల్ 'కిరిక్ పార్టీ' రీమేక్ తో బిజీగా వున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తి కాగానే దిల్ రాజు సినిమాతో వీళ్లు సెట్స్ పైకి వెళతారు. అయితే ఇది 'కార్తికేయ'కి సీక్వెలా .. కాదా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.       
nikhil

More Telugu News