ఎన్టీఆర్ వదిలేశాడు .. రవితేజ పట్టేశాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ వదిలేశాడు .. రవితేజ పట్టేశాడు!

  • 'రాజా ది గ్రేట్' కు భారీ వసూళ్లు 
  • అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ 
  • రవితేజకి హిట్ పడినట్టేనంటున్న సినీ వర్గాలు  
దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'రాజా ది గ్రేట్' .. మొన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అనిల్ రావిపూడి అసలు ఈ కథను ముందుగా ఎన్టీఆర్ కి వినిపించాడట. అయితే తన బాడీ లాంగ్వేజ్ కి ఇది సెట్ కాదని ఎన్టీఆర్ అనడంతో, ఆ కథను రవితేజకు వినిపించాడు.

 రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత అదే జోరును కొనసాగిస్తోంది. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసి రవితేజ ఆనందంతో పొంగిపోతున్నాడట. ఆయనకి మరో హిట్ పడినట్టేననేది ఇండస్ట్రీ టాక్. గతంలో బోయపాటి దర్శకత్వంలో రవితేజ చేసి హిట్ కొట్టిన 'భద్ర' కూడా .. ముందుగా ఎన్టీఆర్ వినేసి నో చెప్పేసిందేనట. ఎన్టీఆర్ నో చెప్పేసిన సినిమాలు రవితేజకు బాగానే కలిసొస్తున్నాయన్న మాట.   
raviteja
mehreen

More Telugu News