జగన్ పాదయాత్ర నేపథ్యంలో.. 'కోర్టు హాజరు నుంచి మినహాయింపు' పిటిషన్ పై మొదలైన విచారణ!
- పాదయాత్రకు అనుమతించాలని కోరిన జగన్
- విచారణ ప్రారంభించిన నాంపల్లి సీబీఐ కోర్టు
- మధ్యాహ్నం తరువాత తీర్పు వెలువడే అవకాశం
అయితే, జగన్ చేసింది చిన్న తప్పు కాదని, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వవద్దని గత వారంలో సీబీఐ వాదించింది. దీనిపై ప్రస్తుతం ఇరు పక్షాల వాదనలనూ న్యాయమూర్తి వింటున్నారు. మధ్యాహ్నం తరువాత తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణుల అంచనా. ఇదిలావుండగా, అక్రమాస్తుల కేసు తప్పుడుదని, తమ పేర్లను తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్లపైనా నేడు విచారణ మొదలుకానుంది. కాగా, జగన్ తదితరుల రాకతో కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొనగా, పోలీసులు భద్రతను పెంచారు.