ముగింపు దశలో 'రాజుగాడు' .. సాహసంతో సంక్రాంతి బరిలోకి!
- షూటింగ్ ముగింపు దశలో 'రాజుగాడు'
- రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్
- కథానాయికగా అమైరా దస్తూర్
ఈ రెండు పాటలను కూడా త్వరలోనే చిత్రీకరించనున్నారు. అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. సాధారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుంటాయి .. తమ బలాబలాలు తేల్చుకుంటూ ఉంటాయి. అలాంటిది ఆ సమయంలో వస్తానని చెబుతుండటం 'రాజుగాడు' చేస్తోన్న సాహసమేనని చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి మరి.