'దంగల్', 'రయీస్' రికార్డులను బద్దలు కొట్టిన విజయ్ 'మెర్సల్'!
Add ap7am to your home Screen

'దంగల్', 'రయీస్' రికార్డులను బద్దలు కొట్టిన విజయ్ 'మెర్సల్'!

  • ఓవర్సీస్ లో సత్తా చాటుతున్న విజయ్ 'మెర్సల్'
  • అమెరికాలో 800 థియేటర్లలో రిలీజ్ అయిన 'మెర్సల్'
  • తొలి రోజు వసూళ్లలో అమీర్ 'దంగల్', షారూఖ్ 'రయీస్' లను దాటేసిన 'మెర్సల్'
ఓవర్సీస్ లో దక్షిణాది సినిమాలు కూడా ఇప్పుడు సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో పలు బాలీవుడ్ సినిమాల కలెక్షన్లను కూడా ఇవి దాటేస్తున్నాయి. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం విడుదలైన కోలీవుడ్ స్టార్ విజయ్ 'మెర్సల్' సినిమా ఓవర్సీస్ వసూళ్లలో రికార్డు దిశగా దూసుకెళ్తోంది.

అమెరికాలో తొలిసారిగా ఈ సినిమా 800 థియేటర్లలో రిలీజ్ కాగా తొలి రోజు 3 లక్షల 57 వేల 925 డాలర్లు వసూలు చేసింది. దీంతో తొలి రోజు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'దంగల్' (3లక్షల 28వేల డాలర్లు), షారూఖ్ 'రయీస్' సినిమా (3లక్షల 49వేల డాలర్లు) రికార్డులను ఇది అధిగమించింది. 
vijay
mersel
overseas
dangal
raees
records

More Telugu News