'రాజా ది గ్రేట్' తొలిరోజు వసూళ్లు .. రవితేజ నటనకు ప్రశంసలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రాజా ది గ్రేట్' తొలిరోజు వసూళ్లు .. రవితేజ నటనకు ప్రశంసలు

  • నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రాజా ది గ్రేట్' 
  • అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ 
  • అంధుడిగా రవితేజ నటనకు ప్రశంసలు    
తొలిసారిగా రవితేజ అంధుడుగా నటించిన 'రాజా ది గ్రేట్' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంధుడిగా రవితేజ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. తొలిరోజున నైజామ్ లో 1.95 కోట్లు .. సీడెడ్ లో 76 లక్షలు .. ఉత్తరాంధ్రలో 60 లక్షలు .. పశ్చిమ గోదావరిలో 30 లక్షలు .. తూర్పు గోదావరిలో 40 లక్షలు .. కృష్ణాలో 29 లక్షలు .. గుంటూరులో 50 లక్షలు .. నెల్లూరులో 22 లక్షలను వసూలు చేసింది.

అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5.02 కోట్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 10 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఈ రోజు నుంచి హాలిడేస్ మూడ్ ఉండటం వలన ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ హిట్ పడిందనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి.
raviteja
mehreen

More Telugu News