మళ్లీ తప్పులో కాలేసి.. నాలుక కరుచుకున్న పాకిస్థాన్
- దేశంలోని ప్రముఖ వారసత్వ కట్టడాల వీడియోను ట్విట్టర్లో ఉంచిన పాక్
- వీడియోలో ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రముఖ మసీదు
- విమర్శలు గుప్పించిన నెటిజన్లు
ఇప్పుడు అలాంటి తప్పిదాన్నే పాక్ మరోసారి చేసింది. పాకిస్థాన్ లోని ప్రముఖ వారసత్వ కట్టడాలను హైలైట్ చేస్తూ పాక్ ఓ వీడియోను రూపొందించింది. దీన్ని పాక్ టూరిజం శాఖ ట్విట్టర్లో అప్ లోడ్ చేసింది. అయితే, ఈ వీడియోలో ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రముఖ హజ్రత్ అలీ మసీదు కూడా ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. ఈ మసీదును 'బ్లూ మసీదు" అంటారు. ఈ తప్పుడు వీడియోపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో, పాక్ పరువు మరోసారి మంటకలిసింది. తప్పు తెలుసుకున్న అధికారులు హుటాహుటీన వీడియోను డిలీట్ చేశారు.